కరోనాపై పోరులో కలిసి పోరాడతాం.. మైక్ పాంపియో

| Edited By: Pardhasaradhi Peri

Apr 17, 2020 | 5:42 PM

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. మెడికల్ పాలసీ..వ్యాక్సీన్ అభివృధ్ది.. ఈ రెండు అంశాల్లో ఉభయ దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన పాంపియో.. వ్యక్తిగత పరిరక్షణ కిట్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి వాటిలో ఈ సహకారం ఉంటుందన్నారు. కేవలం కరోనాపై పోరాటమే కాక.. ఇండో-పసిఫిక్, చైనా, వాణిజ్యం లాంటి ఇతర అంశాల్లో సైతం సహకారానికి  […]

కరోనాపై పోరులో కలిసి పోరాడతాం.. మైక్ పాంపియో
Follow us on

కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. మెడికల్ పాలసీ..వ్యాక్సీన్ అభివృధ్ది.. ఈ రెండు అంశాల్లో ఉభయ దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయని ఆయన చెప్పారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన పాంపియో.. వ్యక్తిగత పరిరక్షణ కిట్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి వాటిలో ఈ సహకారం ఉంటుందన్నారు. కేవలం కరోనాపై పోరాటమే కాక.. ఇండో-పసిఫిక్, చైనా, వాణిజ్యం లాంటి ఇతర అంశాల్లో సైతం సహకారానికి  మేము చేతులు కలుపుతామన్నారు. ఇండియాలో కరోనా వ్యాప్తి నివారణకు తమ దేశం 5.9 మిలియన్ డాలర్లను ఇచ్చిందని ఆయన చెప్పారు. తమ దేశంలో గురువారం నాటికి కరోనా మృతుల సంఖ్య సుమారు 33 వేలకు చేరిందని ఆయన ధృవీకరించారు.