ప్లీజ్ ! వారికి హెల్ప్ చేయండి..’ ప్రియాంక గాంధీ

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 6:11 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వేలాది మంది దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయారని, వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు సహాయపడాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.

ప్లీజ్ ! వారికి హెల్ప్ చేయండి.. ప్రియాంక గాంధీ
Follow us on

దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో వేలాది మంది దినసరి కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయారని, వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు సహాయపడాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా ట్వీట్ చేస్తూ.. బస్సులు, రైళ్లు లేక వీరంతా సరిహద్దుల్లో నిలిచిపోయారని, ఆహారం,  నీరు లేక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ శ్రామికవర్గానికి సహాయ పడవలసిన బాధ్యత ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఉందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు విమానాలను పంపిస్తున్నామని, మరి ఈ దీనుల విషయం మాటేమిటని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. రోజుల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉన్న వీరిని వారి రాష్ట్రాలకు, నగరాలకు, గ్రామాలకు పంపాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఇలాగే ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. 21 రోజుల లాక్ డౌన్ కారణంగా ఇలాంటి అభాగ్యులు పడే కష్టాలను ప్రభుత్వం పరిశీలించాలని, దయార్ద్ర గుణంతో వారిని ఆదుకోవాలని అభ్యర్థించారు.