Corona Tests: అలా అయితే తప్ప కోవిడ్ పరీక్షలు అవసరం లేదు.. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు

|

Jan 11, 2022 | 8:38 AM

ఒక పక్క ఓమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. మరోపక్క కరోనా టెస్టులు చేయడం విషయంలో గందరగోళం. గతంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారిని కలిసిన అందరికీ పరీక్షలు తప్పనిసరిగా చేయించాల్సి వచ్చేది.

Corona Tests: అలా అయితే తప్ప కోవిడ్ పరీక్షలు అవసరం లేదు.. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు
Omicron
Follow us on

Corona Tests: ఒక పక్క ఓమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. మరోపక్క కరోనా టెస్టులు చేయడం విషయంలో గందరగోళం. గతంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారిని కలిసిన అందరికీ పరీక్షలు తప్పనిసరిగా చేయించాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్నప్పటికీ.. మునుపటిలా కఠినమైన ఆరోగ్యపరిస్థితి ఏర్పడటం లేదు. అందువల్ల కరోనా టెస్ట్స్ విషయంలో ఏమి చేయాలి అనేదానిపై ఐసీఎంఆర్ స్పష్టత ఇచ్చింది.

కోవిడ్ పరీక్ష కోసం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కోవిడ్ పరీక్షకు సంబంధించి కొత్త మార్గదర్శాకాలను జారీ చేసింది. దీని ప్రకారం, రిస్క్ కేటగిరీలో ఉంటే తప్ప, కరోనా సోకిన వారితో పరిచయం ఉన్న వ్యక్తులను పరీక్షించాల్సిన అవసరం లేదు. ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు ఇవే!

ఎవరిని పరీక్షించాలి

  • దగ్గు, జ్వరం, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు లేదా ఇలాంటి సమస్యలు ఉన్నవారు, వాసన ..రుచి సమస్యలు ఉన్నవారు పరీక్షించవచ్చు.
  • మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలు ..ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న 60 ఏళ్లు ..అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పరీక్షించవచ్చు.
  • అంతర్జాతీయంగా ప్రయాణించే వ్యక్తులు.
  • భారతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు వచ్చే విదేశీ ప్రయాణికులను మార్గదర్శకాల ప్రకారం పరీక్షించవచ్చు.

వీరికి పరీక్ష అవసరం లేదు

  • ఇన్ఫెక్షన్ లక్షణాలు లేని వ్యక్తులు, వారికి పరీక్షలు అవసరం లేదు.
  • వయస్సు లేదా వ్యాధుల ఆధారంగా రిస్క్ కేటగిరీలోకి వస్తే తప్ప. వ్యాధి సోకిన వ్యక్తి పరిచయాలను పరీక్షించాల్సిన అవసరం లేదు.
  • హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాల ఆధారంగా డిశ్చార్జ్ అయిన రోగులు.
  • కోవిడ్ సెంటర్‌లో చేరి డిశ్చార్జ్ అయిన రోగులు.
  • దేశీయ ప్రయాణాల కోసం అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వారికి కూడా పరీక్ష అవసరం లేదు.

ఆసుపత్రులలో పరీక్ష మార్గదర్శకాలు

  • ఎవరైనా పరీక్షించబడకపోతే, దీని ఆధారంగా శస్త్రచికిత్స లేదా డెలివరీ నిలిపివేయకూడదు.
  • ఒక ఆసుపత్రిలో పరీక్షా సదుపాయం లేకపోతే, రోగిని మరో ఆసుపత్రికి పంపించ కూడదు. వారి నమూనాలను సేకరించి పరీక్ష ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలి.
  • శస్త్రచికిత్స ..విచ్ఛేదనం చేయించుకుంటున్న రోగులు ..డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన మహిళలు లక్షణాలు కనిపిస్తే తప్ప లేదా అవసరమైతే తప్ప పరీక్షించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి:

Covid-19: రోజూవారి కేసుల సంఖ్య 8 లక్షలకు చేరొచ్చు.. అప్రమత్తత అత్యవసరం.. వైద్య నిపుణుల హెచ్చరిక

Pawan Kalyan: కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది అప్రమత్తంగా ఉండండి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్