ఫ్రంట్ లైన్ వారియర్లకు 3 నెలల జీతాలు లేవు, ఇదెక్కడి నిర్లక్ష్యం ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 10, 2020 | 8:09 PM

కోవిడ్ రోగులకు నిరంతరం సేవలందించే ఫ్రంట్ లైన్ వారియర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకప్పుడు వీరిని నెత్తికెత్తుకున్న సర్కార్  మెల్లగా వీరిని పక్కన పెడుతోంది. ఇందుకు నిదర్శనంగా ఢిల్లీలోని హిందూ రావు ఆసుపత్రే తార్కాణంగా నిలుస్తోంది. నగరంలోని ఈ అతి పెద్ద ఆసుపత్రిలో పని చేసే నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. రెసిడెంట్ డాక్టర్లు కూడా వీరి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దీంతో ఈ హాస్పిటల్ […]

ఫ్రంట్ లైన్ వారియర్లకు 3 నెలల జీతాలు లేవు, ఇదెక్కడి నిర్లక్ష్యం ?
Follow us on

కోవిడ్ రోగులకు నిరంతరం సేవలందించే ఫ్రంట్ లైన్ వారియర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకప్పుడు వీరిని నెత్తికెత్తుకున్న సర్కార్  మెల్లగా వీరిని పక్కన పెడుతోంది. ఇందుకు నిదర్శనంగా ఢిల్లీలోని హిందూ రావు ఆసుపత్రే తార్కాణంగా నిలుస్తోంది. నగరంలోని ఈ అతి పెద్ద ఆసుపత్రిలో పని చేసే నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. రెసిడెంట్ డాక్టర్లు కూడా వీరి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దీంతో ఈ హాస్పిటల్ లోని 20 మంది కోవిడ్ రోగులను ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర ఆసుపత్రులకు తరలించారు. మూడు నెలలుగా జీతాలు లేని తాము ఇక పని చేయబోమని ఈ హాస్పిటల్ వైద్య సిబ్బంది అంటున్నారు.