ఆరోగ్యవంతులకూ ఫేస్ మాస్కులు తప్పకపోవచ్చు….

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 4:43 PM

కానీ ఈ కొత్త స్టడీ ప్రకారం.. హెల్దీ పీపుల్ కూడా వీటిని తప్పనిసరిగా ధరించవలసిందేనని లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ హేమ్యాన్ అంటున్నారు.

ఆరోగ్యవంతులకూ ఫేస్ మాస్కులు తప్పకపోవచ్చు....
Follow us on

ఆరోగ్య వంతులు  ఫేస్ మాస్కులు ధరించవలసిన అవసరం లేదని నిన్న మొన్నటివరకు సలహా ఇఛ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక ఆ సలహాను వెనక్కి తీసుకోవలసిందే. కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం నేపథ్యంలో.. ఈ సంస్థ తన ప్రకటనను తిరిగి పరిశీలించవలసిన సమయం ఆసన్నమైందని నిపుణులు అంటున్నారు. కరోనా రోగి గానీ మరొకరు గానీ దగ్గినప్పుడో.. లేదా తుమ్మినప్పుడో వైరస్ పార్టికల్స్ (తుంపరలు) ఆ వ్యక్తికి కనీసం 27 అడుగుల (8 మీటర్లు) దూరంలో పడతాయని ఇటీవల ఓ అధ్యయనంలో కనుగొన్నారు. ఇప్పటివరకు కరోనా రోగులకు చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు లేదా ఇతర హెల్త్ వర్కర్లు మాత్రమే మాస్కులు ధరించాలని, ఇతరులకు అవసరం లేదని అనుకుంటూ వచ్చాం.. కానీ ఈ కొత్త స్టడీ ప్రకారం.. హెల్దీ పీపుల్ కూడా వీటిని తప్పనిసరిగా ధరించవలసిందేనని లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ డేవిడ్ హేమ్యాన్ అంటున్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ…  నిపుణులతో శుక్రవారం చర్చలు జరపనుందన్నారు. మాస్కులు మంచి ప్రయోజనకరమైనవని, వాటిని సరైన సీల్ తో సదా ధరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ తమ ప్రజలకు లక్షలాది మాస్కులను పంపిణీ చేశాయి. ఇదిలా ఉండగా… మూడు కేటగిరీల వారు మాత్రమే మాస్కులు ధరించాలని, ఇతరులకు అవసరం లేదని ఇటీవల భారత ప్రభుత్వం కూడా పేర్కొంది. కరోనా రోగులకు సేవ చేసే వారికే ఇవి ప్రధానమన్నట్టు ప్రకటించింది. కానీ తాజా స్టడీ ప్రకారం.. అంటే ఒక వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతని నోటి నుంచో, ముక్కు నుంచో తుంపరలు అతనికి సుమారు 27 అడుగుల దూరంలో పడతాయన్న నూతన పరిశోధన దరిమిలా.. మన ప్రభుత్వం కూడా తన ప్రకటన సరిదిద్దుకోక తప్పదు.