ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం ప్రమాదకరం.. పి. చిదంబరం

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 6:34 PM

ఇండియాలో ఆరు డెట్ పథకాలను రద్దు చేయాలని  ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరమని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లకు కూడా ముప్పే అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ దేశంలోని ఆరు క్రెడిట్ ఫండ్లకు స్వస్తి చెప్పాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ నిర్ణయించింది. అయితే ఇది […]

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం ప్రమాదకరం.. పి. చిదంబరం
Follow us on

ఇండియాలో ఆరు డెట్ పథకాలను రద్దు చేయాలని  ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లకు, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరమని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లకు కూడా ముప్పే అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ దేశంలోని ఆరు క్రెడిట్ ఫండ్లకు స్వస్తి చెప్పాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ నిర్ణయించింది. అయితే ఇది డేంజరస్ నిర్ణయమని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితే 2008 అక్టోబరులో తలెత్తిందని, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ స్ట్రెస్ ని ఎదుర్కొన్నాయని అయన గుర్తు చేశారు. నాడు ప్రభుత్వం వెంటనే ఆర్ బీ ఐ, సెబీ తదితర సంస్థలను సంప్రదించిందని, అత్యవసర సమావేశం అనంతరం.. ఆ రోజు సాయంత్రమే పరిష్కారాన్ని కనుగొన్నారని ఆయన పేర్కొన్నారు. ఆ మరుసటి రోజున ఆర్ బీ ఐ, సెబీ సమావేశమయ్యాయని, రిజర్వ్ బ్యాంకు 14 రోజుల స్పెషల్ రెపో ఫెసిలిటీని ప్రకటించిందని చిదంబరం వివరించారు. ఎన్ డీ టీ ఎల్ లో 0.5 శాతం అదనపు డిపాజిట్లను రిజర్వ్  బ్యాంకు అనుమతించిందని ఆయన ట్వీట్ చేశారు.