‘మా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం’…ఎయిరిండియా

| Edited By: Pardhasaradhi Peri

Jul 18, 2020 | 12:51 PM

కరోనా వైరస్ కారణంగా తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎయిరిండియా ప్రకటించింది. అయితే తమ విమాన సర్వీసులు కొనసాగేలా చూసేందుకు ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పద్దతి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ..

మా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం...ఎయిరిండియా
Follow us on

కరోనా వైరస్ కారణంగా తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎయిరిండియా ప్రకటించింది. అయితే తమ విమాన సర్వీసులు కొనసాగేలా చూసేందుకు ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పద్దతి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు  ఈ  సంస్థ తెలిపింది. ఈ నెల 7 న ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. వారు స్వచ్చందంగా నైనా సెలవు తీసుకోవచ్చునని, ఈ పథకం ఆరు నెలలు, రెండేళ్లు, లేదా పొడిగించిన పక్షంలో అయిదేళ్ళు కూడా ఉండవచ్చునని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ వేతన బిల్లు నెలకు రూ. 250 కోట్లు ఉంది. ఈ కొత్త పథకాన్ని వినియోగించుకునే ఏ ఉద్యోగి కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్ చేయడానికి వీలు లేదని కూడా ఆంక్షలు విధించారు. అయితే సంస్థ రూల్స్ ప్రకారం.. ఉద్యోగులు తమ సెలవు కాలంలో మెడికల్, ప్యాసేజీ ప్రయోజనాలను పొందవచ్ఛు.