ఢిల్లీలో శానిటైజేషన్ కోసం జపాన్ యంత్రాలు.. స్పెషల్ డ్రైవ్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2020 | 5:19 PM

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగరమంతా శానిటైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జపాన్ యంత్రాలను వాడుతున్నట్టు ప్రకటించారు.

ఢిల్లీలో శానిటైజేషన్ కోసం జపాన్ యంత్రాలు.. స్పెషల్ డ్రైవ్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us on

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగరమంతా శానిటైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జపాన్ యంత్రాలను వాడుతున్నట్టు ప్రకటించారు. రెడ్ జోన్స్ గా ప్రకటించిన కంటెయిన్మెంట్ జోన్ల లోను, ఆరెంజ్ జోన్లుగా పరిగణించిన హైరిస్క్ జోన్లలోనూ వీటిని వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేవలం ఒక గంటలో ఇవి 20 వేల చదరపు మీటర్ల స్థలాన్ని శానిటైజ్ చేస్తాయట. ఈ స్పెషల్ డ్రైవ్ కోసం ఓ ప్రైవేట్ కంపెనీ పది జపనీస్ యంత్రాలను సమకూర్చింది. వీటితో బాటు ఢిల్లీ జల మండలికి చెందిన యంత్రాలను కూడా వాడుతున్నారు. 53 అడుగుల పొడవైన పలక వంటి సాధనం ఇరుకైన సందులు, వీధులను కూడా శానిటైజ్ చేయగలదని అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీ నగరంలో 1154 కరోనా కేసులు నమోదు కాగా.. 24 మంది రోగులు మృతి చెందారు.