‘మా దావూద్ భాయ్ కి కరోనా లేదు’.. సోదరుడు అనీస్ ఇబ్రహీం

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 5:03 PM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి, అతని భార్యకు కోవిడ్-19 సోకిందని, కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వఛ్చిన వార్తలను అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం...

మా దావూద్ భాయ్ కి కరోనా లేదు.. సోదరుడు అనీస్ ఇబ్రహీం
Follow us on

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి, అతని భార్యకు కోవిడ్-19 సోకిందని, కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వఛ్చిన వార్తలను అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం తోసిపుచ్చాడు. దావూద్ తో బాటు అతని మొత్తం కుటుంబమంతా ఈ వైరస్ కి గురైనట్టు వఛ్చిన వార్తలను అతడు ఖండిస్తూ ..వారంతా బాగానే ఉన్నారని, తమ నివాసంలో క్షేమంగానే ఉన్నారని అన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ దేశాల్లో దావూద్ బిజినెస్ వ్యవహారాలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. దావూద్ ఆధ్వర్యంలోని డీ-కంపెనీ అండర్ వరల్డ్ కార్యకలాపాలను, ఫైనాన్స్ ని అనీసే చూసుకుంటున్నాడు. కాగా 1990 ప్రాంతంలో.. ముంబైలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నివాసం నుంచి ఆయుధాలతో కూడిన వాహనాన్ని తీసుకువెళ్తూ అనీస్ పట్టుబడినట్టు వార్తలు వఛ్చిన విషయం  తెలిసిందే. బాలీవుడ్ మూవీలకు అతగాడు ఫైనాన్స్ చేస్తాడని, దుబాయ్ లో క్రికెట్ బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నాడనే  ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. ఒకప్పుడు సౌదీ అరేబియాలో పోలీసులకు పట్టుబడినప్పటికీ భారత పోలీసు బృందం నుంచి తప్పించుకున్నాడట.