‘నా ప్రియ దేశమా ! శోకించు’! మోదీ ప్రసంగం పై చిదంబరం పెదవి విరుపు

| Edited By: Pardhasaradhi Peri

Apr 14, 2020 | 5:22 PM

దేశంలో లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం భగ్గుమన్నారు.  ' ఓ నా ప్రియా దేశమా ! ఇక శోకించు' అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.

నా ప్రియ దేశమా ! శోకించు! మోదీ ప్రసంగం పై చిదంబరం పెదవి విరుపు
Follow us on

దేశంలో లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం భగ్గుమన్నారు.  ‘ ఓ నా ప్రియా దేశమా ! ఇక శోకించు’ అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. మోదీ స్పీచ్.. పేదలను మరికొన్నాళ్లు పేదరికంలోనే ఉండాలని కోరినట్టుగా ఉందన్నారు.  21+19 రోజులు వారి మానాన వారిని గాలికి వదిలేసినట్టు ఉందన్నారు. లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరాన్ని దేశం గుర్తించిందని, కానీ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ప్రభాత్ పట్నాయక్ వంటివారి నిపుణుల సలహాలను మోదీ పెడచెవిన పెట్టారని చిదంబరం ట్వీట్ చేశారు. ఈ దేశంలో డబ్బు, ఆహారం ఉన్నాయని, కానీ వీటిలో దేనినీ ప్రభుత్వం వదలలేదని పేర్కొన్నారు.

మోదీ స్పీచ్ డొల్లగా, పస లేనిదిగా ఉందని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. ‘డెన్మార్క్ ప్రిన్స్ లేని హామ్లెట్ ‘ గా ఉందని ఆయన అభివర్ణించారు. ‘ఆయన ప్రసంగం అమేజింగ్ గా, అద్భుతంగా ఉంది.. కానీ ఆర్ధిక సంబంధ ప్యాకేజీ ఏదీ లేదు.. దాని ఊసే లేదు.. పేదలకు, మధ్యతరగతి వర్గాలకు, ఔత్సాహిక పారిశ్రామికులకు, చిన్నా చితకా వ్యాపారులకు ఎలాంటి రాయితీలు గానీ, ప్రయోజనాలు గానీ కల్పించే విధంగా మాత్రం లేదు’ అని సింఘ్వీ విమర్శించారు. మనిషి మనుగడకు సంబంధించిన ఏ ఒక్క అంశమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఆయన తన ట్వీట్ ముగించారు.