కోవిడ్-19..అంబులెన్సుల ‘మాఫియా’..అడ్డగోలుగా డబ్బు గుంజుతున్న ముఠాలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 1:00 PM

కోవిడ్-19 మహమ్మారి అంబులెన్సుల యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. కరోనా  రోగులను తరలించేందుకు ఉపయోగిస్తున్న ఈ వాహనాలు అత్యధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. యూరప్ దేశాలకు విమాన సర్వీసులు వసూలు..

కోవిడ్-19..అంబులెన్సుల మాఫియా..అడ్డగోలుగా డబ్బు గుంజుతున్న ముఠాలు
Follow us on

కోవిడ్-19 మహమ్మారి అంబులెన్సుల యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. కరోనా  రోగులను తరలించేందుకు ఉపయోగిస్తున్న ఈ వాహనాలు అత్యధికంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. యూరప్ దేశాలకు విమాన సర్వీసులు వసూలు చేసే చార్జీలకన్నా ఇవి హెచ్చుగా ఉంటున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరానికి ఈ అంబులెన్సులు భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఈ చార్జీలను హేతుబధ్ధం చేయక తప్పడంలేదు. మహారాష్ట్రలో 15 కి.మీ. లోపు ప్రయాణానికి ఇవి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్న వైనం గత జూన్ మాసాంతంవరకు కూడా ప్రభుత్వ దృష్టికి రాలేదు. పూణేలో కిలోమీటర్ దూరానికి 3 వేలు, ముంబైలో 7 కిలోమీటర్ల దూరానికి 8 వేల రూపాయలు వసూలు చేశారట. దాంతో అంబులెన్స్ చార్జీలను అక్కడి ప్రభుత్వం రెగ్యులేట్ చేసింది.

హైదరాబాద్ విషయానికి వస్తే.. కోవిడ్ కి ముందు చార్జీలు ఇలా ఉన్నాయి. ఐదు కిలోమీటర్ల దూరానికి 80 నుంచి 120 రూపాయలు, ఔట్ స్టేషన్ (బయటి ప్రాంతాలకు) 25 నుంచి 40 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 10 కి.మీ. దూరానికి 5 వేల నుంచి 10 వేలు, బయటి ప్రాంతాలకయితే కిలోమీటర్ కి 30 నుంచి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.

కోల్ కతా నగరంలో 5 కి.మీ. దూరానికి 6 వేల నుంచి 8 వేలు చార్జి చేస్తున్నారు.

చండీగఢ్ లో బేసిక్ అంబులెన్స్ 250 నుంచి 400 రూపాయలు, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ అయితే 1500 వసూలు చేస్తూవచ్చారు  . కానీ ప్రస్తుతం బేసిక్ 600 రూపాయల నుంచి  800, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ అయితే 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు.

ఝార్ఖండ్ లో కరోనా వైరస్ ప్రబలకముందు 10 కి.మీ.లోపు అయితే రూ. 500, దూర ప్రాంతాలకు కిలోమీటర్ కి 10 రూపాయల చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు 10 కి.మీ. దూరానికి రూ. 900, దూర ప్రయాణాలకు కిలోమీటర్ కి 13 రూపాయల చొప్పున ఛార్జి చేస్తున్నారు.

యూపీలో కరోనా వైరస్ రాక ముందు కి.మీ.కి 10 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 13 రూపాయలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఇష్టం వఛ్చినట్టు చార్జీలు పెంచుతున్నా.. ఇదేమిటని అడిగే నాథుడే లేకుండా పోయాడు.