కరోనా.. దేశంలో దాటిన 24 వేల కేసులు.. స్వల్పంగా పెరిగిన రీకవరీ రేటు

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 7:17 PM

దేశంలో శనివారం నాటికి కరోనా కేసులు 24,942 నమోదయ్యాయి. మరణించిన రోగుల సంఖ్య 775 కి చేరింది. గత 24 గంటల్లో 1490 కేసులు కొత్తగా నమోదు కాగా.. 56 మంది రోగులు మృతి చెందారు. 5,209 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రీకవరీ రేటు 20.52 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏడు శాతం మాత్రమేనన్నారు. అటు- గ్రీన్ […]

కరోనా.. దేశంలో దాటిన 24 వేల కేసులు.. స్వల్పంగా పెరిగిన రీకవరీ రేటు
Follow us on

దేశంలో శనివారం నాటికి కరోనా కేసులు 24,942 నమోదయ్యాయి. మరణించిన రోగుల సంఖ్య 775 కి చేరింది. గత 24 గంటల్లో 1490 కేసులు కొత్తగా నమోదు కాగా.. 56 మంది రోగులు మృతి చెందారు. 5,209 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రీకవరీ రేటు 20.52 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏడు శాతం మాత్రమేనన్నారు. అటు- గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరచుకుంటున్నాయి. మెల్లగా మళ్ళీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలావరకు సడలించారు. అయితే హాట్ స్పాట్ జోన్లు, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.