కరోనా లేదు..అయినా లాక్ డౌన్ ! ఎక్కడ ?

మాస్కోలో ఏప్రిల్ 5 వరకు దాదాపు కర్ఫ్యూ వాతావరణం కొనసాగనుంది. బహుశా ఆ తరువాత ఆంక్షలను పొడిగించే అవకాశం ఉందని పుతిన్ తెలిపారు. అయితే విదేశాల నుంచి వస్తున్నవారితోనే చిక్కొఛ్చి పడిందని అధికారులు.

కరోనా లేదు..అయినా లాక్ డౌన్ ! ఎక్కడ ?

Edited By:

Updated on: Mar 28, 2020 | 4:19 PM

అమెరికా, ఇటలీ వంటి దేశాలు కరోనా మహమ్మారితో అల్లల్లాడుతుండగా రష్యా మాత్రం ఈ రాకాసికి దూరంగా ఉంది. ఆ దేశంలో సుమారు వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రోగుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం రోజులపాటు ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.  మాస్కోలో ఏప్రిల్ 5 వరకు దాదాపు కర్ఫ్యూ వాతావరణం కొనసాగనుంది. బహుశా ఆ తరువాత ఆంక్షలను పొడిగించే అవకాశం ఉందని పుతిన్ తెలిపారు. అయితే విదేశాల నుంచి వస్తున్నవారితోనే చిక్కొఛ్చి పడిందని అధికారులు అంటున్నారు. కేసినోలు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ పాక్షికంగా మూత పడ్డాయి. మాల్స్ సహా బార్లు, హోటళ్లకు వచ్ఛే వినియోగదారులు తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేసి.. వాటిని ఇళ్లకు తీసుకువెళ్లిపోవలసిందిగా అధికారులు సూచిస్తున్నారు. అంటే ఎక్కడా ప్రజలు గుమి కూడే అవకాశం ఉండదు. ఒకవిధంగా వ్యాపారులు తమకు తామే స్వీయ నియంత్రణ (బంద్) ను పాటిస్తున్నారు. కరోనా సోకకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నారు. సాధ్యమైనంత వరకు 70 లేదా 80 ఏళ్ళ వయస్సు దాటినవారు బయట తిరగరాదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పైగా తమ డైట్ విషయంలో రష్యన్లందరూ ఖఛ్చితమైన నియమాలను పాటిస్తున్నారు. ప్రతివ్యక్తీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారవర్గాలు చేస్తున్న ప్రచారం కూడా కరోనా అదుపునకు తోడ్పడుతోంది. ఏమైనా దేశంలో లాక్ డౌన్ వంటి పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రజల అవగాహన, శ్రద్ధ కారణమని భావిస్తున్నారు.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us