బ్రెజిల్..’కరోనా మృత దేహాల ఖననం కోసం’..పాత సమాధులు తవ్వుతున్న వైనం

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2020 | 4:11 PM

బ్రెజిల్ లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 80 వేలు దాటింది. దీంతో ఆ డెడ్ బాడీస్ ని ఖననం కోసం ముఖ్యంగా సావో పాలో సిటీలో మున్సిపల్ సిబ్బంది పాత సమాధులను తవ్వుతున్నారు. వాటిలోనుంచి మృత దేహాలను..

బ్రెజిల్..కరోనా మృత దేహాల ఖననం కోసం..పాత సమాధులు తవ్వుతున్న వైనం
Follow us on

బ్రెజిల్ లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 80 వేలు దాటింది. దీంతో ఆ డెడ్ బాడీస్ ని ఖననం కోసం ముఖ్యంగా సావో పాలో సిటీలో మున్సిపల్ సిబ్బంది పాత సమాధులను తవ్వుతున్నారు. వాటిలోనుంచి మృత దేహాలను బయటకు తీసి కరోనా డెడ్ బాడీలను అక్కడే ఖననం చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం మరణించిన వారి శవాలను వెలికి తీసి.. సంచుల్లో కుక్కి.. వాటిని స్టోరేజీ  కంటెయినర్లలోకి చేరుస్తున్నారు. లాటిన్ అమెరికాలోని కోవిడ్-హాట్ స్పాట్ లలో సావో పాలో నగరం కూడా ఒకటి. గురువారం ఈ సిటీలో 5,480 కరోనా మృత కేసులు నమోదయ్యాయి. ఈ నగరంలో విలా ఫార్మోసా  పేరిట అతి పెద్దశ్మశాన వాటిక ఉంది. బ్లూ ప్రొటెక్టివ్ సూట్లు ధరించిన మున్సిపల్ సిబ్బంది శుక్రవారం ఇక్కడి సమాధులను తవ్వుతూ..పాత శవాలను ఎముకలతో సహా బయటికి తీయడాన్ని స్థానికులు గమనించారు. గత ఏప్రిల్ లో ఈ ప్రాంతంలోనే 1654 మృత దేహాలను ఖననం చేశారు. ఆ తరువాతి నెలల విషయం తెలియలేదు.

ఇటీవలి వరకు తాము రోజుకు 40 శవ పేటికలను తీసేవారమని, కానీ ఇప్పడు ఈ  సంఖ్య రెట్టింపయిందని మున్సిపల్ ఉద్యోగులు తెలిపారు. ఈ సమాధులను తవ్వడం,  శవాలను బయటకు తీయడం,  వాటి స్థానే  కరోనా మృత దేహాలను ‘నింపడం’ తో తాము కూడా  ఎప్పుడు ఈ మహమ్మారి బారిన పడతామో అని వారు ఆందోళన చెందుతున్నారు.