చైనాలో మళ్ళీ ‘కరోనా కలకలం’.. మూడు వారాల్లోనే 108 కొత్త కేసులు

| Edited By: Pardhasaradhi Peri

Apr 13, 2020 | 5:51 PM

చైనాలో కరోనా మళ్ళీ జడలు విప్పుతోంది. కేవలం మూడు వారాల్లో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో చైనీయులు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివస్తున్నారు. వీరిలో అనేకమందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. ఈ ఇంపోర్టెడ్ కేసుల కారణంగా చైనా తిరిగి రెండో విడత కరోనాతో తల్లడిల్లే అవకాశం ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా రష్యా సరిహద్దుల్లోని నగరాలు, పట్టణాలు ఈ ‘వైరస్ కేంద్రాలు’ గా మారుతున్నాయి. రష్యా తో […]

చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. మూడు వారాల్లోనే 108 కొత్త కేసులు
Follow us on

చైనాలో కరోనా మళ్ళీ జడలు విప్పుతోంది. కేవలం మూడు వారాల్లో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రయాణ సంబంధ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయడంతో పెద్ద సంఖ్యలో చైనీయులు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివస్తున్నారు. వీరిలో అనేకమందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. ఈ ఇంపోర్టెడ్ కేసుల కారణంగా చైనా తిరిగి రెండో విడత కరోనాతో తల్లడిల్లే అవకాశం ఉందని భయపడుతున్నారు. ముఖ్యంగా రష్యా సరిహద్దుల్లోని నగరాలు, పట్టణాలు ఈ ‘వైరస్ కేంద్రాలు’ గా మారుతున్నాయి. రష్యా తో గల 2,670 మైళ్ళ బోర్డర్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలనన్నీ చైనా ప్రభుత్వం మూసి వేసింది. అయినా .. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. వూహాన్ సిటీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. బీజింగ్ వంటి పెద్ద నగరాలను  కూడా మళ్ళీ’ కరోనా తుపాను’ ముట్టడిస్తుందేమోనని హెల్త్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.