కరోనా నివారణకు మోదీ సర్కార్ భారీ ఆర్ధిక ప్యాకేజీ ?

| Edited By: Pardhasaradhi Peri

Mar 23, 2020 | 5:04 PM

దేశాన్ని కకావికలం చేస్తున్న కరోనా నివారణకు ప్రధాని మోదీ ప్రభుత్వం భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మోదీ.. ఆర్ధిక మంత్రి నిర్మలా  సీతారామన్ ఆధ్వర్యాన ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి ‘ కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ‘ అని వ్యవహరిస్తామన్నారు. కరోనాపై సమరానికి అందే విరాళాలను ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ గా పరిగణిస్తామని నిర్మల ట్వీట్ చేశారు. ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

కరోనా నివారణకు మోదీ సర్కార్ భారీ ఆర్ధిక ప్యాకేజీ ?
Follow us on

దేశాన్ని కకావికలం చేస్తున్న కరోనా నివారణకు ప్రధాని మోదీ ప్రభుత్వం భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మోదీ.. ఆర్ధిక మంత్రి నిర్మలా  సీతారామన్ ఆధ్వర్యాన ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దీనికి ‘ కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ‘ అని వ్యవహరిస్తామన్నారు. కరోనాపై సమరానికి అందే విరాళాలను ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ గా పరిగణిస్తామని నిర్మల ట్వీట్ చేశారు. ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శక సూత్రాల కింద ఈ మహమ్మారిని నోటిఫైడ్ డిజాస్టర్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె పేర్కొన్నారు. ‘ఇండియా ఫైట్ కరోనా’ పేరిట దీన్ని వ్యవహరిస్తున్నామన్నారు. లక్ష కోట్ల రేట్ టర్మ్ రెపోలను నిర్దేశించాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించిందని, అలాగే సెబీ కూడా సంబంథిత  నిబంధనలను సడలించనుందని ఆమె వివరించారు.  కాగా-కరోనా అదుపునకు ప్రభుత్వం తక్షణమే భారీ ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, పి.చిదంబరం కూడా ప్రభుత్వాన్ని కోరిన సంగతి విదితమే. వచ్ఛే ఆరు నెలల కాలానికి గాను కనీసం అయిదు లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని  ప్రకటించాలని రాహుల్ సూచించారు.