కరోనా వైరస్.. రాష్ట్రాలనుంచి ఫీడ్ బ్యాక్ కోరిన కేంద్రం

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 1:33 PM

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో మళ్ళీ స్కూళ్లను ప్రారంభించే విషయమై విద్యార్థుల తలిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ కోరవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ..

కరోనా వైరస్.. రాష్ట్రాలనుంచి ఫీడ్ బ్యాక్ కోరిన కేంద్రం
Follow us on

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో మళ్ళీ స్కూళ్లను ప్రారంభించే విషయమై విద్యార్థుల తలిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ కోరవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అసలు తిరిగి ఎప్పుడు బడులు, ఇతర విద్యాసంస్థలు ప్రారంభించాలి.. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు.. వారి అభిప్రాయాలేమిటి తదితర వివరాలతో ఫీడ్ బ్యాక్ ని ఈ నెల 20 కల్లా పంపాలని కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు సర్క్యులర్ అందింది. స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్  మేరకు విద్యాశాఖ కార్యదర్శులు ఫీడ్ బ్యాక్ రూపొందించారు. విద్యా సంస్థలను ఆగస్టు మాసంలో లేదా సెప్టెంబరులో లేక అక్టోబరులో తెరవాలా… తెరిస్తే కలిగే  పరిణామాలపై పేరెంట్స్ నుంచి వారి స్పందన ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కేంద్రం తెలుసుకోగోరుతోంది. కాగా.. ఈ తేదీకి సంబంధించి డెడ్ లైన్ ని కేంద్రం పొడిగించే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.