కరోనా సోకి కోలుకున్న వాళ్లు మనదేశంలో 39 లక్షల మంది

|

Sep 15, 2020 | 5:38 PM

భారతదేశంలో ఇప్పటివరకు 38.59 లక్షల మంది కరోనా సోకిన రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని పేర్కొంది.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు..

కరోనా సోకి కోలుకున్న వాళ్లు మనదేశంలో 39 లక్షల మంది
Follow us on

భారతదేశంలో ఇప్పటివరకు 38.59 లక్షల మంది కరోనా సోకిన రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని పేర్కొంది.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5.8 కోట్ల మంది నమూనాలను పరీక్షించారని వెల్లడించింది. గత వారం దేశవ్యాప్తంగా 76 లక్షల పరీక్షలు జరిగాయని పేర్కొంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1/5 వ వంతు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో మాత్రమే కరోనా ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు దేశంలోని మొత్తం యాక్టివ్ కేసులలో 60% కలిగి ఉన్నాయని వెల్లడించింది. భారతదేశంలో మిలియన్ జనాభాకు 3,573 కరోనా కేసులు ఉండగా, ప్రపంచ సగటు మిలియన్ జనాభాకు 3,704 కేసులుగా ఉందని వెల్లడించింది.  భారతదేశంలో మిలియన్ జనాభాకు 58 మరణాలు మాత్రమే ఉన్నాయని..ఇందులో ప్రపంచ సగటు 118 గా ఉందని తెలిపింది.