ఈ నెల 20 నుంచి మళ్ళీ ఐటీ సంస్థలు కళకళ ! అయితే.. కండిషన్స్ అప్లై

| Edited By: Pardhasaradhi Peri

Apr 17, 2020 | 7:42 PM

ఈ నెల 20…సోమవారం నుంచి దేశంలోని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు 50 శాతం సిబ్బందితో తిరిగి పనులు ప్రారంభించవచ్చునని కేంద్రం ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఇప్పటికిప్పుడే మిగతా 50 శాతం సిబ్బందిని అనుమతిస్తున్నట్టు కాదని కూడా స్పష్టం చేసింది. లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించడానికి ముందు కర్నాటక డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ శుక్రవారం బెంగుళూరులో ఐటీ, బీటీ సంస్థల చీఫ్ లతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ […]

ఈ నెల 20 నుంచి మళ్ళీ ఐటీ సంస్థలు కళకళ ! అయితే.. కండిషన్స్ అప్లై
Follow us on

ఈ నెల 20…సోమవారం నుంచి దేశంలోని ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు 50 శాతం సిబ్బందితో తిరిగి పనులు ప్రారంభించవచ్చునని కేంద్రం ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఇప్పటికిప్పుడే మిగతా 50 శాతం సిబ్బందిని అనుమతిస్తున్నట్టు కాదని కూడా స్పష్టం చేసింది. లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించడానికి ముందు కర్నాటక డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ శుక్రవారం బెంగుళూరులో ఐటీ, బీటీ సంస్థల చీఫ్ లతో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా.. ఈ నెల 20 నుంచి ఐటీ సంస్థల్లో తిరిగి  ‘ఎకనమిక్ యాక్టివిటీ’ ప్రారంభమవుతున్నందున.. ఆఫీసు ప్రాంగణాల్లో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని  సూచించారు. ఉద్యోగుల్లో ఎవరికైనా  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నటు కనబడితే స్ట్రిక్ట్ ప్రోటోకాల్ పాటించేలా చూడాలని ఆమె కోరారు. ఇందుకు అశ్వత్థ నారాయణ్ అంగీకరించారు. అయితే లే ఆఫ్ లకు వెళ్లరాదని ఆయన ఆయా సంస్థలకు సూచించారు. కొన్ని కంపెనీలు తక్షణమే సిబ్బందిని విధుల్లోకి తీసుకోవలని, ఇందుకు కొన్ని వారాలు పట్టవచ్ఛునని ఆయన అన్నారు. ఆన్ సైట్ వర్క్ ఫోర్స్ ని దశలవారీగా మళ్ళీ ప్రవేశ పెట్టాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్ జానీ ఘోష్ కోరారు.