కరోనా భూతం.. అగ్ర రాజ్యంలో ఉగ్ర రూపం దాల్చిన నిరుద్యోగం

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 8:05 PM

ఇతర ప్రయోజనాలు కల్పించాలంటూ.. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది గత మార్చి 28 నాటి పరిస్థితి.. అంతకు ముందు వారంలో ఇలాంటి వారి సంఖ్య సుమారు 30 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడిది రెట్టింపు అయింది.

కరోనా భూతం.. అగ్ర రాజ్యంలో ఉగ్ర రూపం దాల్చిన నిరుద్యోగం
Follow us on

కరోనా భూతం నిరుద్యోగులనూ వదలలేదు. ప్రపంచ దేశాల్లో అత్యధిక ధనిక దేశంగా పేరు పొందిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు విలవిలలాడుతోంది. పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ రంగ యూనిట్లు మూతబడడంతో.. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. 60 లక్షల మందికి పైగా నిరుద్యోగులు తమకు నిరుద్యోగ భృతి, ఇతర ప్రయోజనాలు కల్పించాలంటూ.. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇది గత మార్చి 28 నాటి పరిస్థితి.. అంతకు ముందు వారంలో ఇలాంటి వారి సంఖ్య సుమారు 30 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడిది రెట్టింపు అయింది. దాదాపు ప్రతి నిరుద్యోగి కరోనా కారణాన్నే తన దరఖాస్తులో పేర్కొన్నాడట.   గత ఏడాది ఇదే వారంలో కేవలం 2 లక్షల 11 వేల మంది నిరుద్యోగులు మాత్రమే ఇలా అప్లికేషన్లు పెట్టుకున్నారట. అది కూడా మొట్టమొదటిసారిగా..తాజాగా నిరుద్యోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆమోదించింది. ఎక్కువగా  పెన్సిల్వేనియా , ఓహియో, మసాచ్యూసెట్స్, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.