
Union Bank of India Recruitment 2026: నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) శుభవార్త తెలిపింది. మొత్తం 1865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్ శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉండగా, ఈ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్ అందుతుంది. ఒక సంవత్సరం అనుభవంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్ పూర్తి చేసిన వారు అర్హులు కారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసే రాష్ట్రంలోని అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. అయితే ఆ భాషను 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో చదివిన వారికి మినహాయింపు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలుగు భాషపై పట్టు తప్పనిసరి.
అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NSDC) సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
పరీక్ష మొత్తం 100 మార్కులకు, 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి:
ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించిన తరువాత అప్రెంటిస్‌గా నియమిస్తారు.
దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.unionbankofindia.bank.in/en/hom ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.