UGC NET Notification 2026: యూజీసీ నెట్ నోటిఫికేషన్.. అప్లికేషన్‌కి చివరి తేదీ ఇదే! పరీక్షలు ఎప్పుడంటే..?
UGC NET Notification 2026: UGC ఆధ్వర్యంలోని NTA నిర్వహించే UGC-NET జూన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, JRF, PhD ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే UGC-NET జూన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, జేఆర్‌ఎఫ్, అలాగే పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జూన్ 22 నుంచి 30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది.
UGC-NET ముఖ్య సమాచారం
ఈ పరీక్షను ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహిస్తారు. మొత్తం 87 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో పరీక్ష జరుగుతుంది. ఈసారి కొత్తగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కూడా చేర్చారు. ఎక్కువ సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.
అర్హత స్థాయిలు (Categories)
UGC-NETలో మూడు రకాల అర్హత స్థాయిలు ఉంటాయి:
కేటగిరీ 1:
జేఆర్‌ఎఫ్ లభిస్తుంది. పీహెచ్‌డీకి ఫెలోషిప్‌తో చేరవచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా అర్హత ఉంటుంది.
కేటగిరీ 2:
జేఆర్‌ఎఫ్ ఉండదు. కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, పీహెచ్‌డీ అడ్మిషన్లకు అర్హులు.
కేటగిరీ 3:
కేవలం పీహెచ్‌డీ ప్రవేశానికి మాత్రమే అర్హత. అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జేఆర్‌ఎఫ్‌కు కాదు.
విద్యార్హతలు
సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి.
SC/ST/OBC (NCL)/PwD/Third Gender వారికి 50% మార్కులు సరిపోతాయి.
ప్రస్తుతం పీజీ చదువుతున్నవారు కూడా అప్లై చేయవచ్చు.
4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులు (సాధారణంగా 75%, రిజర్వేషన్ వారికి 70%).
అయితే పీజీ లేకుండా ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కాదు.
వయోపరిమితి
జేఆర్‌ఎఫ్ కోసం: గరిష్ఠం 30 సంవత్సరాలు (2026 జూన్ 1 నాటికి)
రిజర్వేషన్ వర్గాలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది
అసిస్టెంట్ ప్రొఫెసర్ & పీహెచ్‌డీకి వయోపరిమితి లేదు