TSPSC ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే?

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) 2026లో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (CBT) షెడ్యూల్‌ను విడుదల చేసింది. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, రోడ్లు-భవనాల శాఖ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టులకు అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ పరీక్ష తేదీలు, హాల్‌టికెట్‌ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలి..

TSPSC ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే?
TSPSC Exam Schedule

Updated on: Sep 28, 2026 | 6:19 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 28: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) 2026లో వివిధ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (CBT) షెడ్యూల్‌ను విడుదల చేసింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన పరీక్షలను అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో నిర్వహించనుంది. తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు సంబంధించిన 20 అసిస్టెంట్‌ సైంటిస్ట్‌, 19 అసిస్టెంట్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు అక్టోబర్‌ 24, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన 222 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టులకు నవంబర్‌ 6, 7 తేదీల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లోని 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నవంబర్‌ 12, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే హాల్‌టికెట్లు, పరీక్ష కేంద్రాలు, పరీక్ష సమయం, ఇతర ముఖ్యమైన సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us