టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు TOSS మరో ఛాన్స్.. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు అవకాశం

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) అక్టోబర్ 2026లో నిర్వహించనున్న ఓపెన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 17 వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. గతంలో ఫెయిల్ అయిన వారు లేదా ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులు కూడా మళ్లీ ఫీజు చెల్లించి పరీక్షలు రాసే అవకాశం కల్పించారు..

టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు TOSS మరో ఛాన్స్.. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు అవకాశం
TOSS October Exams

Updated on: Jul 30, 2026 | 8:16 PM

హైదరాబాద్, జులై 30: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను డైరెక్టర్ కే లింగయ్య ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును TOSS అధికారిక వెబ్‌సైట్, TG Online లేదా మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లించాలని సూచించారు. గతంలో ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారు, అలాగే ఫీజు చెల్లించి కూడా పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించి ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు.

పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు

  • ఎలాంటి ఆలస్య రుసుము (Fine) లేకుండా ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్టు 1 నుంచి 17 వరకు
  • ప్రతి పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో చివరి తేదీ: ఆగస్టు 18 నుంచి 24 వరకు
  • ప్రతి పేపర్‌కు రూ.50 ఆలస్య రుసుముతో చివరి తేదీ: ఆగస్టు 25 నుంచి 29 వరకు
  • తత్కాల్ (Tatkal) విధానంలో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు

అభ్యర్థులకు కీలక సూచనలు

పరీక్షల టైమ్‌టేబుల్ కోసం TOSS అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు సూచించారు. చలానా లేదా డీడీ (Demand Draft) ద్వారా ఫీజు చెల్లింపులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ సెలవు రోజుల్లో ఫీజు స్వీకరణ ఉండదని తెలిపారు. అక్టోబర్‌లో జరిగే ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ఫీజు చెల్లించి అవకాశాన్ని వినియోగించుకోవాలని TOSS సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us