విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం! CM గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో విద్యావ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో టెన్ ప్లస్ టూ (10+2) విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్య అందించడంతో పాటు, 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం! CM గ్రీన్‌సిగ్నల్
10+2 Education System From Next Academic Year

Updated on: Nov 12, 2026 | 6:16 AM

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ విద్యారంగంలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో టెన్ ప్లస్ టూ (10+2) విద్యా విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక కాలానికి, విద్యార్థుల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావిధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. బోధి పెవెలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.

9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్య

తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యా దశగా పరిగణించి విద్యార్థులకు ప్రత్యేక విద్య అందించాలని సీఎం సూచించారు. ఈ దశలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు వారి భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా బోధనా విధానాలను రూపొందించాలని అధికారులకు తెలిపారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను కూడా సంపాదించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

టెన్ ప్లస్ టూ విధానం అమలుతో తెలంగాణ విద్యావ్యవస్థలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us