విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు.. టైమింగ్స్ ఇవే!

రాష్ట్ర పాఠశాల విద్యార్థులకు కీలక అప్‌డేట్. నవంబర్‌లో సమ్మెటివ్‌-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు పరీక్షల తేదీలు, సమయాలు, మార్కుల వివరాలు, ప్రశ్నపత్రాల విధానం, మూల్యాంకన గడువు వంటి పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోండి..

విద్యార్థులకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి సమ్మెటివ్‌ 1 పరీక్షలు.. టైమింగ్స్ ఇవే!
AP Summative 1 Exams Time Table

Updated on: Oct 29, 2026 | 3:20 PM

అమరావతి, అక్టోబర్ 29: పాఠశాల విద్యార్థులకు కీలక అప్‌డేట్. సమ్మెటివ్‌ 1 పరీక్షలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తరగతుల వారీగా పరీక్షల సమయాలు, ప్రశ్నపత్రాల విధానం, మార్కుల వివరాల్లో మార్పులు ఉండనున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు నవంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు 32 ప్రశ్నలు ఇవ్వనున్నారు. రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహించనున్నారు. మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కూడా నిర్దేశించిన పరీక్షల విధానం ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.

6 నుంచి 10వ తరగతి వరకు రెండు సెషన్లలో పరీక్షలు

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నవంబర్ 9 నుంచి 18వ తేదీ వరకు సమ్మెటివ్‌-1 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు 33 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థులకు సామాన్యశాస్త్రం పరీక్షను రెండు పేపర్లుగా విభజించనున్నారు. ఒక్కో పేపర్‌కు 40 మార్కులు కేటాయించనున్నారు. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల నమూనాలో సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను 100 మార్కులకు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించిన ప్రశ్నపత్రాలను క్లస్టర్ కాంప్లెక్స్‌లో, ఆరు నుంచి పదో తరగతుల ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయంలో భద్రపరుస్తారు. ప్రతి పరీక్ష సెషన్ ప్రారంభానికి కేవలం ఒక గంట ముందు మాత్రమే సంబంధిత పాఠశాలలకు ప్రశ్నపత్రాల బండిళ్లను అందజేయనున్నారు. సమ్మెటివ్‌-1 పరీక్షలు ముగిసిన తర్వాత జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నారు. నవంబర్ 25వ తేదీలోపు జవాబుపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులు పరీక్షల తేదీలు, సమయాలను గుర్తుంచుకుని సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us