SSC Phase 13 Results 2026: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ (10+2), గ్రాడ్యుయేషన్ అన్ని..

SSC Phase 13 Results 2026: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫేజ్13 ఫలితాలు విడుదల.. 67,543 మంది ఎంపిక
SSC Selection Post Phase 13 Results

Updated on: Feb 06, 2026 | 3:11 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. SSC ఫేజ్-13 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ రాత పరీక్ష (CBT) ఫలితాలను ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ (10+2), గ్రాడ్యుయేషన్ అన్ని లెవల్స్‌ ఫలితాలు విడుదల చేసింది. మొత్తం 67,543 మంది అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధించినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్ధుల వివరాలతోపాటు కటాఫ్ మార్కులు కూడా ప్రకటించారు.

మెట్రిక్యులేషన్ స్థాయి ఆన్‌లైన్‌ రాత పరీక్ష గతేడాది జూలై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాలలో జరిగింది. ఈ ఉద్యోగాలకు దేశ వ్యాప్తంగా 1,209,332 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 17,720 మంది అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధించారు. అలాగే హయ్యర్ సెకండరీ (10+2) స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షలు జూలై 24 నుంచి ఆగస్టు 2 వరకు, 29వ తేదీలలో జరిగాయి. ఈ పోస్టులకు 708,219 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సీబీటీ 1 పరీక్షలో 14,768 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ స్థాయి పోస్టులకు 10,21,850 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 35,055 మంది తదుపరి దశకు అర్హత సాధించారు. మొత్తం మూడు స్థాయిల్లో 67,543 మంది అభ్యర్థులు సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించినట్లు ఎస్సీస్సీ వెల్లడించింది.

అయితే సీబీటీ 1 పరీక్షలు పలువురి అభ్యర్ధుల ఫలితాలను కమిషన్‌ నిలిపివేసినట్లు పేర్కొంది. మెట్రిక్యులేషన్ స్థాయిలో 46 మంది, హయ్యర్ సెకండరీ స్థాయిలో 29 మంది, గ్రాడ్యుయేషన్ స్థాయిలో 58 మంది ఫలితాలు వివిధ కారణాలతో నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు కటాఫ్ మార్కులను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

ఎస్సెస్సీ ఫేజ్13 సెలక్షన్ పోస్ట్ 2025 సీబీటీ 1 ఫలితాలు, కటాఫ్‌ మార్కుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.