
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రధాన విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC CGL 2026 ద్వారా మొత్తం 12,256 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించిన టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్షను (Tier-I CBE) సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30, 2026 వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. తొలుత టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో టైర్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) ఉంటుంది. అనంతరం అవసరమైన పోస్టులు, నిబంధనలకు అనుగుణంగా ధ్రువపత్రాల పరిశీలన (Document Verification) చేపట్టి తుది ఎంపిక చేస్తారు. SSC CGL 2026 టైర్-1 పరీక్షలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు తమ పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం తదితర వివరాలను అడ్మిట్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు.
SSC CGL ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థల్లో వివిధ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నియామక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కీలక అవకాశంగా నిలవనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసే తాజా సూచనలు, అడ్మిట్ కార్డు, పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.