SSB Constable Recruitment 2026: నెలకు రూ.69 వేల జీతం.. స్పోర్ట్స్ కోటాతో కేంద్ర ప్రభుత్వ జాబ్స్

పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర హోంశాఖకు చెందిన Sashastra Seema Bal (ఎస్‌ఎస్‌బీ) స్పోర్ట్స్ కోటా కింద 404 కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆకర్షణీయమైన వేతనం, అలవెన్సులు లభించనున్నాయి.

SSB Constable Recruitment 2026: నెలకు రూ.69 వేల జీతం.. స్పోర్ట్స్ కోటాతో కేంద్ర ప్రభుత్వ జాబ్స్
Ssb Recruitment 2026

Updated on: May 29, 2026 | 3:24 PM

SSB Constable Recruitment 2026: పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే Sashastra Seema Bal (ఎస్‌ఎస్‌బీ) స్పోర్ట్స్‌ కోటా కింద భారీ స్థాయిలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 404 ఖాళీలను భర్తీ చేయనుండగా, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మంచి వేతనం, అలవెన్సులు లభించనున్నాయి.

పోస్టుల వివరాలు

స్పోర్ట్స్‌ కోటా కింద కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. వాలీబాల్‌, కబడ్డీ, అథ్లెటిక్స్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, హాకీ, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, యోగాసన, జూడో, తైక్వాండో, పవర్‌లిఫ్టింగ్‌ తదితర క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు.

అర్హతలు

గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమాన అర్హత ఉండాలి. గత రెండేళ్లలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం లేదా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. సీనియర్‌ లేదా జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఖేలో ఇండియా గేమ్స్‌లో మెడల్స్‌ గెలుచుకున్నవారు కూడా అర్హులే.

వయోపరిమితి

అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం చెల్లిస్తారు. అదనంగా కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు, పెన్షన్‌ ప్రయోజనాలు కూడా అందిస్తారు.

ఎంపిక విధానం

క్రీడా ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు మార్కులు కేటాయిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. అనంతరం సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), మెడికల్‌ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఫిజికల్‌ అర్హతలు

  • పురుషుల కనీస ఎత్తు : 170 సెం.మీ.
  • మహిళల కనీస ఎత్తు : 157 సెం.మీ.
  • ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో సడలింపు ఉంటుంది.
  • పురుషుల ఛాతీ కొలతలకు కూడా నిర్దిష్ట ప్రమాణాలు అమల్లో ఉంటాయి.
  • బీఎంఐ 18 నుంచి 25 మధ్య ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: జూన్‌ 7, 2026.

అధికారిక వెబ్‌సైట్‌: https://ssb.gov.in/.

 

Follow Us