Mega Job Mela: పెద్ద కంపెనీలతో నేరుగా ఇంటర్వ్యూలు.. ఫాస్ట్ ట్రాక్ జాబ్ గేట్‌వే!

Hyderabad Job Fair: తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక తెలంగాణ జాబ్ మేళా 2026’ను నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, టాస్క్ (TASK), డీట్ (DEET) సంస్థల సహకారంతో ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేయబడుతోంది.

Mega Job Mela: పెద్ద కంపెనీలతో నేరుగా ఇంటర్వ్యూలు.. ఫాస్ట్ ట్రాక్ జాబ్ గేట్‌వే!
Prajapalana Pragati Plan Job Mela 2026

Updated on: May 07, 2026 | 8:09 AM

Telangana Job Mela 2026: తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తెలంగాణ జాబ్ మేళా 2026’ నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా, టాస్క్ (TASK), డీట్ (DEET) సంస్థల సహకారంతో ఈ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మేళా రంగారెడ్డి జిల్లా అభ్యర్థుల కోసం మే 11న ఎల్బీ నగర్ సమీపంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. అలాగే హైదరాబాద్ జిల్లా అభ్యర్థుల కోసం మే 12న బంజారాహిల్స్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ రెండు కార్యక్రమాల్లో 50కి పైగా ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, ఇతర సర్వీస్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

ముందుగా చేయాల్సిందిదే..

పదవ తరగతి నుంచి పీజీ, బీటెక్, డిప్లొమా వరకు అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు పాల్గొనవచ్చు. హాజరయ్యే వారు తమ విద్యా ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, రెజ్యూమే తీసుకురావాలి. ముందుగా డీట్ (DEET) మొబైల్ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంటుంది.

ఎంపికైతే వెంటనే ఆఫర్ లెటర్..

అర్హులైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి వెంటనే ఆఫర్ లెటర్లు ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా జిల్లా ఉపాధి కార్యాలయాలను సంప్రదించవచ్చు.

Follow Us