
హైదరాబాద్, జులై 9: జాయింట్ CSIR-UGC NET జూన్ 2026 పరీక్షలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ జారీ చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జులై 17వ తేదీ నుంచి జరగనున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో అడ్వాన్స్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి తమకు కేటాయించిన పరీక్షా నగరం వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు సిటీ స్లిప్‌ను విడుదల చేసిన ఎన్టీయే పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్)లను అందుబాటులోకి తీసుకురానుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అభ్యర్ధులు తమ పరీక్ష నగరాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, అది అడ్మిట్ కార్డు కాదని ఎన్టీయే స్పష్టం చేసింది. అడ్మిట్ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జులై 17, 18 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో జులై 17న లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పరీక్షలు, అలాగే జులై 18న కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పరీక్షలు జరుగుతాయని ఎన్టీయే వివరించింది.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.