NHAI ఇంటర్న్‌షిప్: నెలకు 20,000 స్టైపెండ్! అర్హతలు తెలుసుకుని ఇప్పుడే అప్లై చేయండి

NHAI Summer Internship 2026 : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జాతీయ రహదారుల నిర్మాణంలో ఆసక్తి ఉన్న యువత కోసం "సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026" కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. గతంలో కేవలం సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే అవకాశమిస్తే, ఇప్పుడు ఇతర విభాగాల విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు.

NHAI ఇంటర్న్‌షిప్: నెలకు 20,000 స్టైపెండ్! అర్హతలు తెలుసుకుని ఇప్పుడే అప్లై చేయండి
Nhai Internship

Updated on: Mar 28, 2026 | 1:44 PM

NHAI Internship 2026: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విద్యార్థులకు గొప్ప అవకాశం అందిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం పొందాలనుకునే యువత కోసం “Summer Internship 2026” కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎంపికైన విద్యార్థులకు శిక్షణతో పాటు నెలకు రూ.20,000 స్టైపెండ్ కూడా అందిస్తుంది.

అర్హత: ఈ ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌టైం UG, PG విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, డేటా సైన్స్, AI కోర్సులలో చదువుతున్నవారు, లా (BA LLB), మేనేజ్‌మెంట్ (MBA-HR, Finance, Marketing), కామర్స్ & సైన్స్ (BA/BCom/BSc), మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ కోర్సులలో విద్యార్థులు అర్హులు.

  • ఇంటర్న్‌షిప్ టైమ్: మే 4 నుంచి జూలై 5 వరకు (సుమారు రెండు నెలలు)
  • వర్క్ లొకేషన్: సెలెక్ట్ అయిన విద్యార్థులు NHAI ఫీల్డ్ ఆఫీసులు లేదా ప్రధాన కార్యాలయంలో Senior Officers & Project Teams పర్యవేక్షణలో పని చేస్తారు.
  • శిక్షణ: ఎంపికైన విద్యార్థులు భారీ రహదారి ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు, నిర్వహణ అంశాలపై శిక్షణ పొందుతారు.
  • స్టైఫండ్ తోపాటు సర్టిఫికేట్: నెలకు ₹20,000 స్టైపెండ్, Internship పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి..?

  • ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక పోర్టల్ internshipsatnhai.digitalindiacorporation.in
    ద్వారా ఆన్‌లైన్ అప్లై చేయాలి.
  • అప్లికేషన్‌లో అకడమిక్, పర్సనల్ వివరాలు ఇవ్వాలి. ప్రాజెక్ట్ లోకేషన్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • విద్యా సంస్థ ఆమోదించిన అప్లికేషన్స్ మాత్రమే తదుపరి ఎంపికలో పరిగణనలోకి తీసుకోబడతాయి.
  • ఎంపిక తర్వాత ప్రాజెక్టులు అభ్యర్థుల ప్రాధాన్యాలు, అందుబాటును బట్టి కేటాయించబడతాయి.
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026
  • మరిన్ని వివరాలు NHAI Internship Portalలో చూడవచ్చు.
Follow Us