NLC India Limited Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నవరత్న కంపెనీ అయిన ఎన్‌ఎల్‌సీ వివిధ యూనిట్లలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రెయినీ(ఫైనాన్స్) పోస్టుల కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 56 ఖాళీలను భర్తీచేయనున్నారు.
* వీటిలో నైవేలీ యూనిట్స్‌లో (24), కార్పొరేట్ ఆఫీస్ (07), బార్సి నగర్ ప్రాజెక్ట్ (03), ఎన్‌టీపీఎల్/ టుటికొరిన్ (06), నుప్పల్, కాన్పూర్ (05), రిజినల్ ఆఫీస్/చెన్నై (02), రిజినల్ ఆఫీస్ / చెన్నై – కమర్షియల్ (02), రిజినల్ ఆఫీస్ / న్యూఢిల్లీ (02), తలబైర ప్రాజెక్ట్ (04), సౌత్ పహారా – దుమ్కా (01) ఖాళీలు ఉన్నాయి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏలో ఇంటర్మీడియట్ లేదా సీఎంఏలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులు కేవలం ఏడాది మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ. 22,000 అందిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 11-01-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 22-11-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Drugs: లెహంగాల్లో దాచి డ్రగ్స్ రవాణా.. కంగుతిన్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు
Drugs: లెహంగాల్లో దాచి డ్రగ్స్ రవాణా.. కంగుతిన్న నార్కోటిక్స్ బ్యూరో అధికారులు