ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (IIT గౌహతి) JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు ఫలితాన్ని తనిఖీ చేయడానికి ఇక్కడ ఇచ్చిన స్టెప్పులను అనుసరించవచ్చు.
ఈ ఏడాది పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. రెండో షిప్టును మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్ష తాత్కాలిక సమాధానాల కీలు జూన్ 09, జూన్ 11 న విడుదల చేయబడ్డాయి. అనంతరం పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాన్ని చెక్ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ 2023లో మొత్తం 1,80, 372 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ ఏడాది పరీక్షలో హైదరాబాద్ జోన్‌కు చెందిన వీసీ రెడ్డి టాపర్‌గా నిలిచారు. ఈ పరీక్షను మొత్తం 360 మార్కులకు నిర్వహించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పేపర్లు ఉన్నాయి. మొత్తం మూడు పేపర్లను రెండు షిఫ్టుల్లో 60-60 మార్కులకు నిర్వహించారు. ఇది కాకుండా, పరీక్ష తుది సమాధాన కీని కూడా IIT గౌహతి విడుదల చేసింది.
స్టెప్ 1: JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి .
స్టెప్ 2: తర్వాత అభ్యర్థి హోమ్ పేజీలో రిజల్ట్ సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: దీని తర్వాత, విద్యార్థులు తమ లాగిన్ ఐడిని నింపి, ఆపై దానిని సమర్పించండి.
స్టెప్ 4: ఇప్పుడు విద్యార్థి ఫలితం కనిపిస్తుంది.
స్టెప్ 5: ఆ తర్వాత విద్యార్థి ఫలితాన్ని డౌన్లోడ్ చేయండి.
స్టెప్ 6: చివరగా, విద్యార్థి ఫలితం ప్రింట్ అవుట్ తీసుకోండి.
మరిన్ని కెరీర్ న్యూస్ కోసం