IOCL Senior Law Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. మొత్తం18 సీనియర్ లా ఆఫీసర్, లా ఆఫీసర్ పోస్టుల (Senior Law Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీలో ఎల్‌ఎల్‌బీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 5 యేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జూన్ 30, 2022 నాటికి 30 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండానే ఆగస్టు 14, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్ 2022 పీజీ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ర్యాంక్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు 50,000ల నుంచి రూ.60,000ల జీతంతో ఉద్యోగులుగా ఎంపికవుతారు.
ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ ను క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.