ఇంటర్ తర్వాత ఏ కాలేజీ ఎంచుకోవాలి? అడ్మిషన్‌కు ముందు తప్పక చెక్ చేయాల్సిన 7 కీలక విషయాలు

Inter After Intermediate: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు, ఏ కాలేజీ ఎంచుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది విద్యార్థులు ఉంటారు. కేవలం ఫీజు, దూరం, సౌకర్యాలే కాకుండా అకడమిక్ నాణ్యత, ప్లేస్‌మెంట్స్, స్కిల్ డెవలప్‌మెంట్, మౌలిక వసతులు వంటి అంశాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో కీలకం.

ఇంటర్ తర్వాత ఏ కాలేజీ ఎంచుకోవాలి? అడ్మిషన్‌కు ముందు తప్పక చెక్ చేయాల్సిన 7 కీలక విషయాలు
Inter After Intermediate

Updated on: May 30, 2026 | 4:43 PM

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ కాలేజీలో చేరాలి? అనే సందేహాలు చాలా మంది విద్యార్థులను వెంటాడుతుంటాయి. సాధారణంగా కోర్సు ఫీజు, కాలేజీ దూరం, సౌకర్యాలు వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి మాత్రమే సరిపోవు. విద్యార్థుల కెరీర్‌ను ప్రభావితం చేసే మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అకడమిక్ నాణ్యతకు ప్రాధాన్యం కాలేజీ ఎంపికలో ముందుగా ఆ విద్యాసంస్థ విద్యా ప్రమాణాలను పరిశీలించాలి. గుర్తింపు, అక్రిడిటేషన్, ర్యాంకింగ్స్, బోధన నాణ్యత వంటి అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకుల అనుభవం, విద్యార్థులకు అందించే మార్గదర్శకత్వం, పరిశ్రమలకు అనుగుణంగా బోధించే విధానం వంటి అంశాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దోహదపడతాయి. ప్లేస్‌మెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయి? కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడం విద్యార్థుల ప్రధాన లక్ష్యం. అందుకే సంబంధిత కాలేజీలో గత కొన్నేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డులను పరిశీలించడం అవసరం. ఏయే సంస్థలు క్యాంపస్ నియామకాలు నిర్వహిస్తున్నాయి? విద్యార్థులు సాధించిన ఉద్యోగాల శాతం ఎంత? సగటు, అత్యధిక వేతన ప్యాకేజీలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను తెలుసుకోవాలి. ఇవి కూడా చదవండి ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి