Indian Bank Jobs 2025: ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లక్షల్లో జీతం

దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో స్కేల్ 1, 2, 3, 4లలో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ బ్యాంకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 171 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను..

Indian Bank Jobs 2025: ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లక్షల్లో జీతం
Indian Bank Jobs

Updated on: Sep 29, 2025 | 5:48 PM

ఇండియన్ బ్యాంకు.. దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో స్కేల్ 1, 2, 3, 4లలో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 171 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. క్రెడిట్ అనలిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, కోఆపరేటివ్‌ క్రెడిట్‌ అనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, కంపెనీ సెక్రటరీ, చార్టెడ్‌ అకౌంట్‌.. విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో సీఏ, సీడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ, ఐసీఏఐ, పీజీ, బీఈ/ బీటెక్‌, ఎంసీఏ, ఎంసీఏ/ ఎంఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్‌, పీజీడీబీఎం, ఎల్ఎల్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి తప్పనిసరిగా 23 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 13, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము కిం జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఆకర్షణీయ జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు. ఇతర వివరాలు ఈ కింద నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us