India Post Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

|

Feb 23, 2022 | 1:43 PM

ఇండియా పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ (India Post).. తపాలా శాఖలోని స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల (Staff Car Driver posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

India Post Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
India Post
Follow us on

India Post Staff Car Driver Recruitment 2022: ఇండియా పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ (India Post).. తపాలా శాఖలోని స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల (Staff Car Driver posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

పోస్టుల వివరాలు: స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు

డివిజన్ వారీగా ఖాళీల వివరాలు:

  • మెయిల్ మోటార్ సర్వీస్ కోయంబత్తూర్: 11
  • ఈరోడ్ డివిజన్: 2
  • నీలగిరి డివిజన్: 1
  • సేలం వెస్ట్ డివిజన్: 2
  • తిరుపూర్ డివిజన్: 1

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైట్, హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: లెవల్‌ 2 ఆధారంగా జీతాలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిప్యూటీ చీఫ్‌ పర్సనల్ ఆఫీసర్‌ (కన్‌స్ట్రక్షన్), సెంట్రల్‌ రైల్వే, ముంబాయి, మహారాష్ట్ర-400001.

దరఖాస్తు రుసుము:
జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500
ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/మహిళా అభ్యర్ధులకు: రూ.250

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Central Railway Jobs: అకడమిక్‌ మెరిట్ ఆధారంగా ఎంపికలు.. సెంట్రల్ రైల్వేలో జూనియర్‌ టెక్నికల్‌ అసోసియేట్ ఉద్యోగాలు..!