
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-RRBs XV ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,706 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ నియామకాల్లో గ్రూప్-ఏ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులు ఉన్నాయి.
IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, చార్టర్డ్ అకౌంటెన్సీ (CA), MBA తదితర విద్యార్హతలు ఉండాలి. నిర్దిష్ట పోస్టుకు అవసరమైన విద్యార్హతను అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆఫీసర్ స్కేల్-I పోస్టులకు 18–30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-II పోస్టులకు 21–32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-III పోస్టులకు 21–40 ఏళ్లు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18–28 ఏళ్ల వరకు వయసు ఉండాలి. వయస్సును నోటిఫికేషన్‌లో పేర్కొన్న కటాఫ్ తేదీ ఆధారంగా లెక్కిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 21, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపికకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్/సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి ప్రక్రియలు ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉండగా, ఆఫీసర్ పోస్టులకు పోస్టును బట్టి ప్రిలిమ్స్, మెయిన్స్/సింగిల్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.