తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

Telangana Jobs Update: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులకు ఊరటనిచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో వయో పరిమితిని పెంచే అంశంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అవతరణ అనంతరం 2022లో అప్పటి ప్రభుత్వం నిరుద్యోగులకు వయో సడలింపు ఇచ్చింది. అయితే ఆ వయో సడలింపు గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన విషయం తెలిసిందే.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
Telangana Jobs Update

Updated on: May 08, 2026 | 8:57 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులకు ఊరటనిచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లలో వయో పరిమితిని పెంచే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం నిరుద్యోగులకు వయో సడలింపు ఇచ్చింది. ఆ సమయంలో జనరల్ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 44 ఏళ్లు, రిజర్వ్ వర్గాలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు అవకాశం లభించింది. అయితే ఆ సడలింపు గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది.

ఇప్పుడు కొత్తగా వయో పరిమితిని ఐదేళ్లు పెంచాలా లేదా పదేళ్లు పెంచాలా అనే విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో జనరల్ కేటగిరీకి ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పదేళ్ల సడలింపు ఇవ్వాలనే ప్రతిపాదనపై ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం అన్ని వర్గాలకు సమానంగా పదేళ్ల సడలింపు ఇవ్వాలని కోరుతున్నాయి.

త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లలో వయో సడలింపు పెంచాలని పలువురు శాసనసభ, శాసన మండలి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే ఎమ్మెల్సీ కోదండరామ్, అద్దంకి దయాకర్ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గతంలో నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల చాలామంది అభ్యర్థులు నష్టపోయారని వారు గుర్తుచేశారు. ఈ అభ్యర్థనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Follow Us