
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతీ సంవత్సరం పది తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి చదువులు పూర్తి చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వీరిలో చదువు పూర్తైన వెంటనే ఉద్యోగాలు పొందే వారు తక్కువే. చాలామంది ఉద్యోగ అవకాశాల గురించి తెలియకపోవడం, నోటిఫికేషన్లను గమనించకపోవడం వల్ల నిరుద్యోగిగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEE Telangana) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా యువతకు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఏ శాఖలో ఏ రకమైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు పది తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థుల సంఖ్య సుమారుగా లక్షమందికి పైగా ఉంది.
DEE Telangana యాప్ కృత్రిమ మేధ (AI) ఆధారితంగా పనిచేస్తుంది.
నిరుద్యోగులు మాత్రమే కాదు, ఉద్యోగం ఇచ్చే సంస్థలు కూడా ఈ యాప్‌లో నమోదు అవ్వవచ్చు.
ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగం పొందదలచినవారు, ఉద్యోగం అందించదలచిన సంస్థలు కలసి సులభంగా ఇంటరాక్ట్ కావచ్చు.
రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల గమనింపు, నోటిఫికేషన్ అందించడం, అవసరమైన పరిజ్ఞానం కల్పించడం ఇలా అన్ని విధాలా యువతకు ఉపయోగకరంగా ఉంటుంది.