ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన.. ఎన్ని వేల పోస్టులంటే..?

ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు.

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన.. ఎన్ని వేల పోస్టులంటే..?
Ap Electricity Jobs

Updated on: Feb 19, 2026 | 5:01 PM

అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ కీలక ప్రకటన చేశారు.

త్వరలోనే 2947 పోస్టుల భర్తీ

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 2,947 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి వివరాలను మంత్రి సభకు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్లు 581, జూనియర్ లైన్ మెన్ 1,260, అసిస్టెంట్ లైన్ మెన్ 1,084, లైన్ మెన్ 22 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖలో ఏఈలు, లైన్ మెన్ల కొరత లేకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కొత్త సబ్ స్టేషన్లు

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లో-వోల్టేజ్ సమస్యలు లేకుండా, నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇంధన శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పునరుద్ఘాటించారు. విద్యుత్ లోడ్ ఆధారంగా అవసరమైన చోట కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేస్తున్నామని, అదేవిధంగా ఎలక్ట్రికల్ డీఈ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని శాసన సభలో సభ్యులకు మంత్రి గొట్టిపాటి వివరించారు.

Follow Us