
DRDO Internship Selection Process: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) 2026 సంవత్సరానికి సంబంధించిన వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. రక్షణ పరిశోధన, సాంకేతిక రంగాలపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది విలువైన అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్‌ను DIPAS (డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్) నిర్వహిస్తోంది. BE/B.Tech లేదా ME/M.Tech చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మంచి అకాడమిక్ రికార్డు ఉండాలి, ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు.
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమై, మే 15, 2026 వరకు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులు 4 నుంచి 6 నెలలపాటు శిక్షణ పొందుతారు. శిక్షణ సాధారణంగా మే లేదా జూన్‌లో ప్రారంభమవుతుంది.
ఇంటర్న్‌షిప్ Delhi లేదా Haldwaniలోని DRDO కేంద్రాల్లో జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు నిజ జీవిత పరిశోధన వాతావరణంలో పని చేసే అవకాశం పొందుతారు.
మరిన్ని వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.