GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!

ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలతో పాటు పలు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSUs) ఉద్యోగాలకు అర్హత కల్పించే GATE 2027 పరీక్షకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27తో ముగియనుంది. ఈ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న..

GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!
GATE Application Deadline

Updated on: Sep 27, 2026 | 3:43 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 27: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలతో పాటు పలు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSUs) ఉద్యోగాలకు అర్హత కల్పించే GATE 2027 పరీక్షకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27తో ముగియనుంది. ఈ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో మూడో సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఇప్పటికే సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు GATE 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు తర్వాత కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 5, 2026 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫీజు విషయానికి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,000గా, ఇతర అభ్యర్థులకు రూ.2,000గా నిర్ణయించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే వారికి నిర్ణీత అదనపు రుసుము వర్తిస్తుంది.

కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్

GATE 2027లో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలిసారిగా ‘రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్’ విభాగాన్ని కొత్త పేపర్‌గా చేర్చారు. దీంతో మొత్తం 30 పేపర్లలో GATE 2027 పరీక్ష నిర్వహించనున్నారు.

ఆరు రోజుల్లో పరీక్ష

GATE 2027 పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. పరీక్షలు 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో రెండు సెషన్లలో జరగనున్నాయి. GATE స్కోర్ ఆధారంగా ఐఐటీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పీజీ, పరిశోధన కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ నియామక ప్రక్రియలో GATE స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. GATE 2027లో సాధించిన స్కోర్‌కార్డు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయి. దీంతో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి సంవత్సరాల్లోనూ తమ స్కోర్‌ను అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. GATE 2027కు దరఖాస్తు చేయాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2026 రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించడం జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us