Exim Bank Recruitment 2026: ఎగ్జిమ్ బ్యాంకులో 120 ఉద్యోగాలు.. రూ.30 లక్షల వరకు జీతం!

ఎగ్జిమ్ బ్యాంక్ (Export-Import Bank of India)లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ విభాగాల్లో మొత్తం 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు శిక్షణ సమయంలో నెలకు రూ.65,000 స్టైఫండ్ అందించనుండగా, మేనేజర్ పోస్టులకు వార్షిక సీటీసీ సుమారు రూ.30 లక్షల వరకు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు..

Exim Bank Recruitment 2026: ఎగ్జిమ్ బ్యాంకులో 120 ఉద్యోగాలు.. రూ.30 లక్షల వరకు జీతం!
Exim Bank Recruitment

Updated on: Nov 15, 2026 | 6:47 AM

ముంబయిలోని ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 120 మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

మేనేజ్‌మెంట్ ట్రెయినీ – 90 పోస్టులు

  • బ్యాంకింగ్ ఆపరేషన్స్ (క్రెడిట్/లోన్స్/అడ్వాన్సెస్) పోస్టుల సంఖ్య: 50
  • లీగల్ పోస్టుల సంఖ్య: 10
  • డిజిటల్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 9
  • ఇంటర్నల్ ఆడిట్ పోస్టుల సంఖ్య: 5
  • ట్రెజరీ అండ్ అకౌంట్స్ పోస్టుల సంఖ్య: 3
  • కంప్లయన్స్ పోస్టుల సంఖ్య: 2
  • రిస్క్ మేనేజ్‌మెంట్ పోస్టుల సంఖ్య: 2
  • సైబర్ సెక్యూరిటీ పోస్టుల సంఖ్య: 2
  • హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ పోస్టుల సంఖ్య: 2
  • అడ్మినిస్ట్రేషన్ పోస్టుల సంఖ్య: 2
  • ఇంటర్నేషనల్ రిలేషన్స్ పోస్టుల సంఖ్య: 1
  • ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ పోస్టుల సంఖ్య: 1
  • కార్పొరేట్ కమ్యూనికేషన్స్ పోస్టుల సంఖ్య: 1

మేనేజర్ (గ్రేడ్/స్కేల్-II) – 30 పోస్టులు

  • క్రెడిట్ అప్రైజల్ పోస్టుల సంఖ్య: 4
  • లోన్ ఆపరేషన్స్ అండ్ డాక్యుమెంటరీ మానిటరింగ్ (క్రెడిట్) పోస్టుల సంఖ్య: 3
  • లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్ (బ్యాంక్ గ్యారంటీస్) పోస్టుల సంఖ్య: 3
  • లోన్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్ (ట్రేడ్ ఫైనాన్స్) పోస్టుల సంఖ్య: 4
  • స్పెషల్ సిట్యుయేషన్స్ గ్రూప్/రికవరీ పోస్టుల సంఖ్య: 3
  • రిస్క్ మేనేజ్‌మెంట్ పోస్టుల సంఖ్య: 2
  • కంప్లయన్స్ పోస్టుల సంఖ్య: 2
  • ఇంటర్నల్ ఆడిట్ (ట్రెజరీ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్) పోస్టుల సంఖ్య: 2
  • MSME పోస్టుల సంఖ్య: 2
  • సస్టెయినబుల్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ పోస్టుల సంఖ్య: 2
  • కార్పొరేట్ కమ్యూనికేషన్స్/కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పోస్టుల సంఖ్య: 2
  • ఇంటర్నల్ ఆడిట్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) పోస్టుల సంఖ్య: 1

మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత పోస్టులకు నిర్దేశించిన పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, ఎంఎంఎస్, ఎంసీఏ, బీఈ/బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంఈ/ఎంటెక్ వంటి అర్హతలు పోస్టును బట్టి అవసరమవుతాయి. మేనేజర్ పోస్టులకు సంబంధిత వృత్తిపరమైన అర్హతలతోపాటు కనీసం నాలుగేళ్ల పని అనుభవం తప్పనిసరి. సీఏ, ఐసీఏఐ మెంబర్‌షిప్, ఏసీఎస్ లేదా సీఐఎస్‌ఏ వంటి అర్హతలు సంబంధిత పోస్టులకు అవసరం. మే 2027 నాటికి తమ చివరి పరీక్షలను పూర్తి చేసుకునే అభ్యర్థులు కూడా నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 నవంబర్ 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు.. మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు, మేనేజర్ పోస్టుకలు 24 నుంచి 30 ఏళ్లు చొప్పున ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 11, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సంబంధిత పోస్టులకు నిర్దేశించిన అర్హతలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఎంపికైన అభ్యర్ధులకు మేనేజ్‌మెంట్ ట్రెయినీ శిక్షణ సమయంలో నెలకు రూ.65,000 స్టైఫండ్ అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత డిప్యూటీ మేనేజర్ (JM-I)గా నియమిస్తారు. మేనేజర్ (MM-II): ప్రస్తుత వార్షిక కాస్ట్ టు కంపెనీ (CTC) సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 27, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2026.
  • రాత పరీక్ష: డిసెంబర్ 2026 (తాత్కాలికంగా)

ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us