Andhra Pradesh ESIC Jobs 2026: ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్

ESIC Jobs Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

Andhra Pradesh ESIC Jobs 2026: ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
Esic Jobs Andhra Pradesh

Updated on: Apr 23, 2026 | 5:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎంప్లయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ భర్తీని చేపడుతున్నారు.

అర్హతలు:

సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ శాఖలు, కేంద్ర/రాష్ట్ర PSUలు లేదా ఇతర సంస్థల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంది.

గరిష్ట వయస్సు:

12.05.2026 నాటికి 64 సంవత్సరాలు

వేతనం: ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ నెలవారీ వేతనాన్ని వారు చివరిగా పొందిన వేతనం నుంచి పెన్షన్ మొత్తాన్ని మినహాయించడం ద్వారా లెక్కిస్తారు. పెన్షన్ రాని ప్రభుత్వ/ఇతర సంస్థల నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగుల కొరకు, కన్సాలిడేటెడ్ పే..

  • అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): నెలకు రూ. 45,000
  • జూనియర్ ఇంజినీర్ (సివిల్), ఎలక్ట్రిక్: నెలకు రూ. 33,630.
  • పదవీ కాలం: ఒక సంవత్సరం (సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా లేదా రెగ్యులర్ ఇంక్యుబెంట్ నియామకం అయ్యే వరకు, ఏది ముందు అయితే దాని ప్రాతిపదికన ఇది వార్షిక ప్రాదిపదికన పొడిగించదగినది.) 65 సంవత్సరాలు దాటిన వారికి పొడిగింపు మంజూరు చేయబడదు.
  • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ (షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తులు మాత్రమే).
  • దరఖాస్తు చివరి తేదీ: 12-05-2026.
  • ఇంటర్వ్యూ తేదీ: షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు తెలియజేయబడుతుంది.

తాజా నోటిఫికేషన్లు, ఖాళీల కోసం, అభ్యర్థులు ESIC అధికారిక వెబ్‌సైట్ esic.gov.in లేదా ప్రాంతీయ కార్యాలయం వెబ్‌సైట్ roap.esic.gov.in ను క్రమంగా తనిఖీ చేయవచ్చు.

హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు

హైదరాబాద్ నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఆర్టీజన్, జూనియర్ ఆర్టీజన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 2026 ఏప్రిల్ 28వ తేదీ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు..

  • ప్రాజెక్ట్ ఇంజినీర్: 05
  • టెక్నికల్ ఆఫీసర్: 11
  • అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 03
  • సీనియర్ ఆర్టీజన్: 02
  • జూనియర్ ఆర్టీజన్: 03

 

  • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
  • వయో పరిమితి: 30 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
  • జీతం: నెలకు పోస్టులను బట్టి రూ. 23,868 నుంచి రూ. 40 వేల వరకు, ప్రతీ సంవత్సరం పెరుగుతుంది.
  • ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
  • ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 28, 2026
  • స్థలం: ఈసీఐఎల్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్.

వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.ecil.co.in/jobs.html ను సంప్రదించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us