Dasara Holidays 2026: ఎల్‌నినో ఎఫెక్ట్.. విద్యార్ధులకు దసరా సెలవులు పొడిగింపు! ఎన్ని రోజులంటే..

Updated on: Oct 23, 2026 | 8:00 PM

Dasara Holidays 2026 Extended: దసరా సెలవులు సుమారు 10 రోజులు గడచిన తర్వాత విద్యార్ధులకు విద్యాశాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విద్యార్దులకు భారీగా సెలవులు కలిసి వచ్చాయి..

1 / 5
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌ (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వర్షాభావ పరిస్థితులు, సమీపంలోని చెరువు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో క్యాంపస్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

2 / 5
దీంతో దసరా సెలవుల అనంతరం శుక్రవారం ప్రారంభం కావాల్సిన తరగతులను అధికారులు వాయిదా వేశారు. నీటి కొరత తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 9 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

3 / 5
వీరికి రోజూ సుమారు 25 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. అయితే ప్రస్తుతం క్యాంపస్‌కు కేవలం 15 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతోంది.

4 / 5
విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వస్తే తాగునీరు, స్నానాలు, వంటశాలలు, పారిశుద్ధ్య అవసరాలకు నీటిని సమకూర్చడం కష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరగతులను ప్రారంభించడం సాధ్యం కాదని నిర్ణయించి సెలవులను పొడిగించారు. క్యాంపస్‌కు నీటిని అందిస్తున్న సమీప చెరువులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా గోదావరి నది నుంచి క్యాంపస్‌కు నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

5 / 5
క్యాంపస్‌కు రోజుకు అవసరమైన 25 లక్షల లీటర్లకు పైగా నీటిని నిరంతరంగా సరఫరా చేయగలిగిన తర్వాతే తరగతులను తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. నీటి కొరత కారణంగా క్యాంపస్‌లో విద్యా కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. నీటి సరఫరా పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటు పూర్తయిన తర్వాతే క్యాంపస్‌ను తిరిగి ప్రారంభించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us