10th పాసైనవారికి బంపర్ ఛాన్స్! టీటీడీ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ + హాస్టల్ సదుపాయం

TTD Education Scheme: ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం సరైన కోర్సులను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ శిల్పకళపై ఆసక్తి ఉన్న పదో తరగతి ఉత్తీర్ణుల కోసం మంచి అవకాశాన్ని ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చివరి తేదీలను తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు.

10th పాసైనవారికి బంపర్ ఛాన్స్! టీటీడీ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్ + హాస్టల్ సదుపాయం
TTD Education Scheme

Updated on: May 06, 2026 | 11:43 AM

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాల తర్వాత విద్యార్థులు తదుపరి చదువులపై ఆలోచనలో ఉన్న వేళ.. టీటీడీ(Tirumala Tirupati Devasthanams) ఒక ప్రత్యేక అవకాశం ప్రకటించింది. శిల్పకళపై ఆసక్తి ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

అందుబాటులో ఉన్న కోర్సులు

ఈ కళాశాలలో ప్రధానంగా రెండు రకాల కోర్సులు ఉన్నాయి:

  • 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు (ట్రెడిషనల్ స్కల్ప్చర్)..
  • ఇందులో శిలా శిల్పం, ఆలయ నిర్మాణం, సుధా శిల్పం, లోహ శిల్పం, కొయ్య శిల్పం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సును రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, AICTE అనుమతితో నిర్వహిస్తున్నారు.
  • 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు.. సంప్రదాయ కలంకారి కళ
  • వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుకు ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలోనే (సుమారు 10 మంది) విద్యార్థులను ఎంపిక చేస్తారు.

అర్హత & ప్రవేశ విధానం

  • కనీస అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • ఎంపిక: ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశ పరీక్ష ఆధారంగా
  • దరఖాస్తు కాలం: మే 4 నుంచి జూన్ 20, 2026 వరకు
  • అప్లికేషన్‌ను కళాశాలలో నేరుగా లేదా టీటీడీ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

సీట్లు, సదుపాయాలు

  • మొత్తం సీట్లు: ప్రతి విభాగానికి సుమారు 10 మంది చొప్పున, మొత్తం సుమారు 60 మంది
  • ఉచిత హాస్టల్, భోజన సదుపాయం
  • విద్యార్థుల పేరిట రూ. 1 లక్ష బ్యాంక్ డిపాజిట్, కోర్సు పూర్తయ్యాక వడ్డీతో సహా అందజేత
  • చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రసిద్ధ ఆలయాల సందర్శన అవకాశం

ఉపాధి అవకాశాలు

ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు:

  • టీటీడీ ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో ఉద్యోగాలు
  • దేవాదాయ, పురావస్తు, పర్యాటక శాఖల్లో అవకాశాలు
  • స్థపతి, టెక్నికల్ అసిస్టెంట్, కాంట్రాక్టర్ వంటి పాత్రల్లో పని చేసే అవకాశం
  • స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తారంగా ఉన్నాయి

కళాశాల ప్రత్యేకత

1960లో స్థాపించబడిన ఈ కళాశాల భారతీయ సంప్రదాయ ఆలయ శిల్పకళను పరిరక్షిస్తూ, నైపుణ్య శిల్పులను తయారు చేస్తున్న ఏకైక సంస్థగా గుర్తింపు పొందింది.

సంప్రదించాల్సిన వివరాలు

  • చిరునామా: శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ, అలిపిరి రోడ్, తిరుపతి – 517507.
  • వెబ్‌సైట్: www.tirumala.org
  • ఫోన్: 0877-2264637
  • ఈ విధంగా శిల్పకళపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అరుదైన, భవిష్యత్తు అవకాశాలు కలిగిన కోర్సుగా చెప్పవచ్చు.
Follow Us