
హైదరాబాద్, మే 25: ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ 2026 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మే 28న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు షనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఆ రోజు రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహించవల్సి ఉంది. ఈద్-ఉల్-జుహా (బక్రీద్) సెలవు తేదీలో మార్పు చేస్తున్నట్లు మే 24వ తేదీన కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో బక్రీద్ సందర్భంగా సెలవు తేదీలో వచ్చిన మార్పు కారణంగా DoPT జారీ చేసిన నోటిఫికేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ పేర్కొన్నది. పరీక్ష కొత్త తేదీలను ఎన్‌టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్‌ల ద్వారా తెలియజేస్తామని ఎన్టీయే పేర్కొంది.
📢 Important update for CUET (UG) 2026 candidates.
ఇవి కూడా చదవండిThe examinations scheduled for 28 May 2026 (both shifts) stand postponed — in view of the change in the date of the Id-ul-Zuha (Bakrid) holiday as per Government of India notification.
🗓️ Revised exam dates for affected… pic.twitter.com/I9KhTFwMhE
— National Testing Agency (@NTA_Exams) May 24, 2026
కాగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు సహా ప్రఖ్యాత వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్, పరీక్షా ప్రకటనలకు సంబంధించిన తాజా సమాచారం కోసం విద్యార్థులు అధికారిక NTA, CUET వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించింది. ఇతర సందేహాలకు అభ్యర్థులు 011-40759000 నంబర్‌లో NTA హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు లేదా cuet-ug@nta.ac.in కు ఈమెయిల్ చేయవచ్చు. ఇతర వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.