CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31లోగా అప్లై చేసుకోండి!

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్టు గ్రాడ్యుయేట్ (PG) లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే దరఖాస్తు గడువు మరో వారంలో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. క్లాట్‌-2027 పరీక్షను డిసెంబర్ 6, 2026న నిర్వహించనున్నారు..

CLAT 2027 ఇంకా దరఖాస్తు చేసుకోలేదా..? అక్టోబర్ 31లోగా అప్లై చేసుకోండి!
CLAT 2027 Registration Last Date

Updated on: Oct 25, 2026 | 2:05 PM

దేశవ్యాప్తంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో (NLUs) న్యాయ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్టు గ్రాడ్యుయేట్ (PG) లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే దరఖాస్తు గడువు మరో వారంలో ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. క్లాట్‌-2027 పరీక్షను డిసెంబర్ 6, 2026న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 31, 2026తో ముగియనుంది.

CLAT ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా అభ్యర్థులకు 2 రకాల కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ (UG): ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) కోర్సు, పోస్టు గ్రాడ్యుయేట్ (PG): ఏడాది ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. యూజీ కోర్సులకు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్షలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ కోర్సులకు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న పూర్తి అర్హతలు, నిబంధనలను పరిశీలించాలి. అర్హులైన అభ్యర్థులు CLAT అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల సమాచారం నమోదు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు రుసుము, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

కాగా CLAT ద్వారా దేశంలోని పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. వీటిలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (NALSAR), భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ (NLIU), కోల్‌కతాలోని వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (WBNUJS), జోధ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ (NLU) తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అలాగే రాయ్‌పూర్, గాంధీనగర్, లఖ్‌నవూ, పట్నా, కొచ్చి, రాంచీ, ముంబయి, నాగ్‌పుర్, షిమ్లా, జబల్‌పూర్, తిరుచిరాపల్లి, అగర్తలా తదితర ప్రాంతాల్లోని న్యాయ విశ్వవిద్యాలయాల్లోనూ ప్రవేశ అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయాల వారీగా సీట్లు, ప్రవేశ నిబంధనలు, కౌన్సెలింగ్ వివరాలను అధికారిక సమాచారంలో పరిశీలించాలి. న్యాయ విద్యలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించి, గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించవచ్చు.

CLAT 2027 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 3, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2026
  • ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2026
  • పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • పరీక్ష విధానం: ఆఫ్‌లైన్

క్లాట్‌ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us